లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింప వచ్చునేమో చూతమనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 9:11

వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.

మార్కు 9:12

అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?

మార్కు 9:13

ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

మత్తయి 17:11

అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే;

మత్తయి 17:12

అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారిచేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను

మత్తయి 17:13

అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

మత్తయి 27:47

అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.

మత్తయి 27:48

వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;

మత్తయి 27:49

తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి.

మార్కు 6:15

ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.