మార్కు 15: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.
మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను.
ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.
ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను
అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.
మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకమువంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమదినముగా ఉండును.
అందుకు యెహోవా మోషేతో ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశముమీద చీకటి చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.
నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱలలోనుండియైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.
నిప్పుకణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదములక్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
దానినిబట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది, అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని, నేను పశ్చాత్తాప పడుటలేదు రద్దుచేయుటలేదు.
దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును.
ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.