మార్కు 15: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అధికారులనెదిరించి, కలహములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను.
అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి.
జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదలచేయుట అధిపతికి వాడుక.
కాబట్టి నేనితనిని
శిక్షించి విడుదలచేయుదునని వారితో చెప్పగా
అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.
అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.
రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను.
అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.
అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి యుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.