లేఖనాలను అన్వేషించండి

మార్కు 15: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" పిలాతు ఆయనను చూచి మరల నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 27:12

ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

లూకా 23:2

ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

లూకా 23:3

పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

లూకా 23:4

పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.

లూకా 23:5

అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

యోహాను 18:29

కావున పిలాతు బయట ఉన్న వారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.

యోహాను 18:30

అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.

యోహాను 18:31

పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా

యోహాను 19:6

ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేయగా పిలాతు ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువ వేయుడని వారితో చెప్పెను.

యోహాను 19:7

అందుకు యూదులు మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.

యోహాను 19:12

ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.

మార్కు 15:5

అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.

మార్కు 14:60

ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసునడిగెను.

మార్కు 14:61

అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయననడుగగా

యెషయా 53:7

అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

కీర్తనలు 38:14

నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

యోహాను 18:30

అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.

యోహాను 19:9

నీవెక్కడనుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు

అపోస్తలులకార్యములు 25:7

పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేకపోయిరి.