Logo

యెషయా అధ్యాయము 10 వచనము 21

యెషయా 1:9 సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపనియెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.

యెషయా 4:2 ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనినవారికి భూమిపంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును.

యెషయా 4:3 సీయోనులో శేషించినవారికి యెరూషలేములో నిలువబడినవానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు.

యెషయా 6:13 దానిలో పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సిందూర మస్తకివృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును; అట్టి మొద్దునుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును.

యెషయా 37:4 జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

యెషయా 37:31 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

యెషయా 37:32 శేషించువారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు, తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.

ఎజ్రా 9:14 ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా.

రోమీయులకు 9:27 మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని

రోమీయులకు 9:28 యెషయాయు ఇశ్రాయేలునుగూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.

రోమీయులకు 9:29 మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.

2రాజులు 16:7 ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరు రాజునకు కానుకగా పంపి

2దినవృత్తాంతములు 28:20 అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనే గాని అతని బలపరచలేదు.

హోషేయ 5:13 తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.

హోషేయ 14:3 అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మాచేతిపనితో చెప్పము; తండ్రిలేనివారియెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

యెషయా 17:7 ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమచేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు.

యెషయా 17:8 మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును

యెషయా 26:3 ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.

యెషయా 26:4 యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

యెషయా 48:1 యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలోనుండి బయలుదేరి వచ్చినవారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతిసత్యములను అనుసరింపనివారలారా, ఈ మాట ఆలకించుడి.

యెషయా 48:2 వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

యెషయా 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.

1రాజులు 19:18 అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దుపెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.

2రాజులు 19:30 యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.

ఎజ్రా 2:64 సమాజము యొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.

యెషయా 4:1 ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.

యెషయా 7:10 యెహోవా ఇంకను ఆహాజునకు ఈలాగు సెలవిచ్చెను

యెషయా 24:13 ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలముల కోత తీరినతరువాత పరిగెపండ్లను ఏరుకొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.

యెషయా 27:7 అతని కొట్టినవారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెనా? అతనివలన చంపబడినవారు చంపబడినట్లు అతడు చంపబడెనా?

యెషయా 28:5 ఆ దినమున సైన్యములకధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును సౌందర్యముగల మకుటముగా నుండును.

యెషయా 37:23 నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా?

యెషయా 65:9 యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించుకొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.

యిర్మియా 44:14 కావున తాము మరలివచ్చి యూదా దేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

యెహెజ్కేలు 14:22 దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీయొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటినిగూర్చియు మీరు ఓదార్పు నొందుదురు

మీకా 5:3 కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులలో శేషించినవారును ఇశ్రాయేలీయులతో కూడ తిరిగివత్తురు.

జెఫన్యా 3:13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;

యోహాను 4:23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు (మూలభాషలో - వెదుకుచున్నాడు)