Logo

యెషయా అధ్యాయము 10 వచనము 28

యెషయా 9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువుకాడిని నీవు విరిచియున్నావు వాని మెడను కట్టుకఱ్ఱను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు.

యెషయా 14:25 నా దేశములో అష్షూరును సంహరించెదను నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను వాని కాడి నా జనులమీదనుండి తొలగిపోవును వాని భారము వారి భుజముమీదనుండి తొలగింపబడును.

2రాజులు 18:13 రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా

2రాజులు 18:14 యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరువందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.

నహూము 1:9 యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును.

నహూము 1:10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు.

నహూము 1:11 నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

నహూము 1:12 యెహోవా సెలవిచ్చునదేమనగా వారు విస్తారజనమై పూర్ణబలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు; నేను నిన్ను బాధపరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.

నహూము 1:13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.

యెషయా 37:35 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.

2సమూయేలు 1:21 గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాఢ్యుల డాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టు1సౌలు డాలును పారవేయబడెను.

కీర్తనలు 2:1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

కీర్తనలు 2:2 మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2:3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

కీర్తనలు 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను

కీర్తనలు 20:6 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.

కీర్తనలు 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.

కీర్తనలు 84:9 దేవా, మా కేడెమా, దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము.

కీర్తనలు 89:20 నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.

కీర్తనలు 89:21 నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.

కీర్తనలు 89:22 ఏ శత్రువును అతనిమీద జయమునొందడు దోషకారులు అతని బాధపరచరు.

కీర్తనలు 89:23 అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.

కీర్తనలు 89:24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.

కీర్తనలు 89:25 నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.

కీర్తనలు 89:26 నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.

కీర్తనలు 89:27 కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.

కీర్తనలు 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

కీర్తనలు 89:29 శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

కీర్తనలు 89:30 అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల

కీర్తనలు 89:31 వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల

కీర్తనలు 89:32 నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.

కీర్తనలు 89:33 కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడముచేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.

కీర్తనలు 89:34 నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.

కీర్తనలు 89:35 అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు

కీర్తనలు 89:36 చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు

కీర్తనలు 89:37 నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.

కీర్తనలు 89:38 ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపియున్నావు.

కీర్తనలు 89:39 నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచియున్నావు.

కీర్తనలు 89:40 అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు

కీర్తనలు 89:41 త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.

కీర్తనలు 89:42 అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచియున్నావు

కీర్తనలు 89:43 అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు

కీర్తనలు 89:44 అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు

కీర్తనలు 89:45 అతని యౌవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)

కీర్తనలు 89:46 యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

కీర్తనలు 89:47 నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించియున్నావు?

కీర్తనలు 89:48 మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశముకాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

కీర్తనలు 89:49 ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?

కీర్తనలు 89:50 ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.

కీర్తనలు 89:51 యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.

కీర్తనలు 89:52 యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్‌ ఆమేన్‌.

కీర్తనలు 105:15 ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.

కీర్తనలు 132:10 నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.

కీర్తనలు 132:17 అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను నా అభిషిక్తునికొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచియున్నాను.

కీర్తనలు 132:18 అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

దానియేలు 9:24 తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధస్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను.

దానియేలు 9:25 యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరల కట్టబడును.

దానియేలు 9:26 ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు, వాని అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధకాలాంతమువరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను.

లూకా 4:18 ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

యోహాను 1:41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి

అపోస్తలులకార్యములు 4:27 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో,

1యోహాను 2:20 అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.

1యోహాను 2:27 అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు భోదించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు భోదించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు (నిలిచియుండుడి).

నిర్గమకాండము 28:41 నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.

లేవీయకాండము 7:35 వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలోనుండినది అభిషేకమునుబట్టి అహరోనుకును అభిషేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.

సంఖ్యాకాండము 18:8 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.

కీర్తనలు 81:6 వారి భుజమునుండి నేను బరువును దింపగా వారిచేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.

యెషయా 49:25 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించెదను.

యిర్మియా 2:20 పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని నేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.

యిర్మియా 30:8 సెన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న కాడి నీ మెడనుండకుండ ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను; ఇకను అన్యులు యాకోబు సంతతివారిచేత దాస్యము చేయించుకొనరు గాని

యెహెజ్కేలు 30:18 ఐగుప్తుపెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 34:27 ఫలవృక్ష ములు ఫలములిచ్చును, భూమి పంటపండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

నహూము 1:13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.