Logo

యెషయా అధ్యాయము 17 వచనము 3

సంఖ్యాకాండము 32:34 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను

ద్వితియోపదేశాకాండము 2:36 అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగరమొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.

ద్వితియోపదేశాకాండము 3:12 అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును, మనము అప్పుడు స్వాధీనపరచుకొనిన దేశమును, దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని.

యెహోషువ 13:16 వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు

యిర్మియా 48:19 ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.

యెషయా 5:17 అది మేతబీడుగా నుండును గొఱ్ఱపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

యెషయా 7:23 ఆ దినమున వెయ్యి వెండి నాణముల విలువగల వెయ్యి ద్రాక్షచెట్లుండు ప్రతి స్థలమున గచ్చపొదలును బలురక్కసి చెట్లును పెరుగును.

యెషయా 7:24 ఈ దేశమంతయు గచ్చపొదలతోను బలురక్కసి చెట్లతోను నిండియుండును గనుక బాణములను విండ్లనుచేత పట్టుకొని జనులు అక్కడికి పోవుదురు.

యెషయా 7:25 పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చపొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱలు త్రొక్కుటకును ఉపయోగమగును.

యెహెజ్కేలు 25:5 నేను రబ్బా పట్టణమును ఒంటెలసాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

జెఫన్యా 2:6 సముద్రప్రాంతము గొఱ్ఱల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.

యిర్మియా 7:33 ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

2సమూయేలు 24:5 యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి

1దినవృత్తాంతములు 5:8 యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపువారు అరోయేరునందును నెబోవరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.

యెషయా 7:21 ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొఱ్ఱలను పెంచుకొనగా

యెషయా 7:25 పారచేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల భయముచేతను గచ్చపొదల భయముచేతను జనులు అక్కడికి పోరు; అది యెడ్లను తోలుటకును గొఱ్ఱలు త్రొక్కుటకును ఉపయోగమగును.

యెషయా 27:10 ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువబడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.

జెఫన్యా 3:13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;