Logo

యెషయా అధ్యాయము 17 వచనము 5

యెషయా 9:8 ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలువరకు దిగివచ్చియున్నది.

యెషయా 9:21 మనష్షే ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనష్షేను భక్షించును వీరిద్దరు ఏకీభవించి యూదామీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 10:4 వారు చెరపట్టబడినవారి క్రింద దాగుకొనుచున్నారు హతులైనవారి క్రింద కూలుచున్నారు ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

యెషయా 10:16 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.

యెషయా 24:13 ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలముల కోత తీరినతరువాత పరిగెపండ్లను ఏరుకొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.

యెషయా 24:16 నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతమునుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు.

ద్వితియోపదేశాకాండము 32:15 యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణశైలమును తృణీకరించెను.

ద్వితియోపదేశాకాండము 32:16 వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి

ద్వితియోపదేశాకాండము 32:17 వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.

ద్వితియోపదేశాకాండము 32:18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.

ద్వితియోపదేశాకాండము 32:19 యెహోవా దానిని చూచెను. తన కూమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను.

ద్వితియోపదేశాకాండము 32:20 ఆయన ఇట్లనుకొనెను నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసములేని పిల్లలు.

ద్వితియోపదేశాకాండము 32:21 వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకాని వారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

ద్వితియోపదేశాకాండము 32:22 నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.

ద్వితియోపదేశాకాండము 32:23 వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారిమీద నా బాణములన్నిటిని వేసెదను.

ద్వితియోపదేశాకాండము 32:24 వారు కరవుచేత క్షీణించుదురు మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.

ద్వితియోపదేశాకాండము 32:25 బయట ఖడ్గమును లోపట భయమును యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రుకలు గలవారిని నశింపజేయును.

ద్వితియోపదేశాకాండము 32:26 వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో

ద్వితియోపదేశాకాండము 32:27 ఇదంతయు యెహోవా చేసినది కాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.

యెహెజ్కేలు 34:20 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱలకును చిక్కిపోయిన గొఱ్ఱలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.

జెఫన్యా 2:11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.

యెషయా 16:14 కూలివాని లెక్కప్రకారము మూడేండ్లలోగా మోయాబీయులయొక్క ప్రభావమును వారిగొప్ప వారి సమూహమును అవమానపరచబడును శేషము బహు కొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును.

యెషయా 17:9 ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయముచేత అడవిలోను కొండశిఖరముమీదను జనులు విడిచిపోయిన స్థలములవలె నగును. ఆ దేశము పాడగును

యెషయా 21:17 కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.

యిర్మియా 13:25 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యెహెజ్కేలు 14:22 దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీయొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటినిగూర్చియు మీరు ఓదార్పు నొందుదురు

ఆమోసు 6:13 న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి.