Logo

యెహెజ్కేలు అధ్యాయము 33 వచనము 5

2దినవృత్తాంతములు 25:16 అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి నీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము; నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించి యున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.

సామెతలు 29:1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

యిర్మియా 6:17 మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది.

యిర్మియా 42:20 మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.

యిర్మియా 42:21 నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి.

యిర్మియా 42:22 కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.

జెకర్యా 1:2 యెహోవా మీ పితరులమీద బహుగా కోపించెను.

జెకర్యా 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

జెకర్యా 1:4 మీరు మీ పితరులవంటివారై యుండవద్దు; పూర్వికులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి; ఇదే యెహోవా వాక్కు.

యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.

యెహెజ్కేలు 33:5 బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడినయెడల తన ప్రాణమును రక్షించుకొనును.

యెహెజ్కేలు 33:9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.

యెహెజ్కేలు 18:13 అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాదియగును.

లేవీయకాండము 20:9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.

లేవీయకాండము 20:11 తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

లేవీయకాండము 20:12 ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

లేవీయకాండము 20:13 ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియను చేసిరిగనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

లేవీయకాండము 20:14 ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసికొనినయెడల అది దుష్కామప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

లేవీయకాండము 20:15 జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

లేవీయకాండము 20:16 స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

లేవీయకాండము 20:17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.

లేవీయకాండము 20:18 కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

లేవీయకాండము 20:19 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

లేవీయకాండము 20:20 పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

లేవీయకాండము 20:21 ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.

లేవీయకాండము 20:22 కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

లేవీయకాండము 20:23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్యపడితిని.

లేవీయకాండము 20:24 నేను మీతో చెప్పిన మాట యిదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

లేవీయకాండము 20:25 కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

లేవీయకాండము 20:26 మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారైయుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

లేవీయకాండము 20:27 పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

2సమూయేలు 1:16 నీ నోటి మాటయే నీమీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.

1రాజులు 2:37 నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలిసికొనుము, నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా

అపోస్తలులకార్యములు 18:6 వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి

అపోస్తలులకార్యములు 20:26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.

యెహోషువ 2:19 నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగు దుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.

యిర్మియా 7:3 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

అపోస్తలులకార్యములు 27:11 అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.

కొలొస్సయులకు 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.