Logo

యెహెజ్కేలు అధ్యాయము 33 వచనము 23

యెహెజ్కేలు 1:3 యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను.

యెహెజ్కేలు 3:22 అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి, నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము, అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను.

యెహెజ్కేలు 37:1 యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా

యెహెజ్కేలు 40:1 మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొనిపోయెను.

యెహెజ్కేలు 3:26 నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను.

యెహెజ్కేలు 3:27 అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను, వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారియొద్దకు పోయి వినువాడు వినునుగాక విననొల్లనివాడు విననొల్లకయుండును గాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను.

యెహెజ్కేలు 24:26 ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక, తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు;

యెహెజ్కేలు 24:27 నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.

నిర్గమకాండము 4:11 యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.

యెహెజ్కేలు 29:21 ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

దానియేలు 10:15 అతడీమాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని.

దానియేలు 10:16 అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,

లూకా 1:64 వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.

ప్రకటన 9:17 మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచితిని. ఆ గుఱ్ఱములకును వాటి మీద కూర్చుండి యున్నవారికిని, నిప్పువలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి, వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుచుండెను.