Logo

నిర్గమకాండము అధ్యాయము 14 వచనము 27

నిర్గమకాండము 14:21 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

నిర్గమకాండము 14:22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.

నిర్గమకాండము 15:1 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవాను గూర్చి యీ కీర్తన పాడిరి యెహోవాను గూర్చి గానము చేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను

నిర్గమకాండము 15:2 యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

నిర్గమకాండము 15:3 యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.

నిర్గమకాండము 15:4 ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱ సముద్రములో మునిగిపోయిరి

నిర్గమకాండము 15:5 అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.

నిర్గమకాండము 15:6 యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును.

నిర్గమకాండము 15:7 నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును.

నిర్గమకాండము 15:8 నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రము మధ్య గడ్డకట్టెను

నిర్గమకాండము 15:9 తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.

నిర్గమకాండము 15:10 నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.

నిర్గమకాండము 15:11 యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

నిర్గమకాండము 15:12 నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మింగివేసెను.

నిర్గమకాండము 15:13 నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి.

నిర్గమకాండము 15:14 జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.

నిర్గమకాండము 15:15 ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును.

నిర్గమకాండము 15:16 యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.

నిర్గమకాండము 15:17 నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను

నిర్గమకాండము 15:18 నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.

నిర్గమకాండము 15:19 ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారిమీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.

నిర్గమకాండము 15:20 మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా

నిర్గమకాండము 15:21 మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.

యెహోషువ 4:18 యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను నడుమనుండి యెక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడినేలను నిలువగానే యొర్దాను నీళ్లు వాటిచోటికి ఎప్పటివలెనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను.

న్యాయాధిపతులు 5:20 వెండి లాభము వారు తీసికొనలేదు నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను.

న్యాయాధిపతులు 5:21 కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొనిపోయిరి. నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.

ఆదికాండము 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.

యెహోషువ 24:7 వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివ సించితిరి.

నెహెమ్యా 9:11 మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.

యోబు 38:13 అది దుష్టులను తనలోనుండకుండ దులిపివేయునట్లును నీవెప్పుడైన ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా?

కీర్తనలు 46:5 దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు.

కీర్తనలు 76:6 యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

కీర్తనలు 78:53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

కీర్తనలు 106:9 ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను.

కీర్తనలు 106:11 నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

కీర్తనలు 136:15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

యెషయా 33:2 యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము.

జెకర్యా 10:11 యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

అపోస్తలులకార్యములు 7:36 ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.