Logo

నిర్గమకాండము అధ్యాయము 14 వచనము 28

నిర్గమకాండము 15:10 నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.

ద్వితియోపదేశాకాండము 11:4 ఆయన ఐగుప్తు దండునకును దాని గుఱ్ఱములకును రథములకును చేసినదానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎఱ్ఱసముద్ర జలమును వారిమీద ప్రవహింపజేసిన దానిని

నెహెమ్యా 9:11 మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.

కీర్తనలు 78:53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.

హబక్కూకు 3:8 యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు?

హబక్కూకు 3:9 విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా.) భూమిని బద్దలుచేసి నదులను కలుగజేయుచున్నావు.

హబక్కూకు 3:10 నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తనచేతులు పైకెత్తును.

హబక్కూకు 3:13 నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు.(సెలా.)

హెబ్రీయులకు 11:29 విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.

నిర్గమకాండము 14:13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.

2దినవృత్తాంతములు 20:24 యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.

కీర్తనలు 106:9 ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను.

కీర్తనలు 106:10 వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.

కీర్తనలు 106:11 నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

కీర్తనలు 136:15 ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.

ఆదికాండము 7:18 జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను.

ఆదికాండము 7:23 నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.

ఆదికాండము 50:9 మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను.

నిర్గమకాండము 9:15 భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.

నిర్గమకాండము 15:5 అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.

నిర్గమకాండము 15:19 ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవా వారిమీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిరి.

యెహోషువ 24:7 వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివ సించితిరి.

1దినవృత్తాంతములు 14:11 వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసి జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము2 అను పేరుపెట్టెను.

యోబు 36:30 ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.

కీర్తనలు 33:16 ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.

కీర్తనలు 74:13 నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి.

కీర్తనలు 76:6 యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.

కీర్తనలు 77:19 నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.

కీర్తనలు 106:11 నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

ప్రసంగి 8:9 సూర్యుని క్రింద జరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.

హగ్గయి 2:22 రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనముచేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.

జెకర్యా 10:11 యెహోవా దుఃఖసముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

మార్కు 4:39 అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.