Logo

నిర్గమకాండము అధ్యాయము 28 వచనము 18

నిర్గమకాండము 39:11 పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది;

యెహెజ్కేలు 27:16 నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.

నిర్గమకాండము 24:10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.

యోబు 28:6 దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.

యోబు 28:16 అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.

పరమగీతము 5:14 అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళమువలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది.

యెహెజ్కేలు 1:26 వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనమువంటిదొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను.

యెహెజ్కేలు 10:1 నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలము వంటిదానిలో నీలకాంతమయమైన సింహాసనమువంటిదొకటి అగుపడెను.

ప్రకటన 4:3 ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి యుండెను.

యిర్మియా 17:1 వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా

యెహెజ్కేలు 28:13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.