Logo

నిర్గమకాండము అధ్యాయము 34 వచనము 2

నిర్గమకాండము 19:20 యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను

నిర్గమకాండము 19:24 అందుకు యెహోవా నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పెను

నిర్గమకాండము 24:12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

ద్వితియోపదేశాకాండము 9:25 కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని నలువది పగళ్లు నలువది రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింపజేసెదననగా

నిర్గమకాండము 19:3 మోషే దేవుని యొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతమునుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా

ద్వితియోపదేశాకాండము 10:1 ఆ కాలమందు యెహోవా మునుపటి వాటివంటి రెండు రాతిపలకలను నీవు చెక్కుకొని కొండయెక్కి నాయొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కఱ్ఱమందసమును చేసికొనవలెను.

ద్వితియోపదేశాకాండము 31:14 మరియు యెహోవా చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,

1రాజులు 19:11 అందుకాయన నీవు పోయి పర్వతముమీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను; శిలలు ఛిన్నా భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు.

ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను