Logo

నిర్గమకాండము అధ్యాయము 34 వచనము 20

నిర్గమకాండము 13:10 కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.

సంఖ్యాకాండము 18:15 మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.

నిర్గమకాండము 13:15 ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.

సంఖ్యాకాండము 3:45 నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నావారైయుందురు; నేనే యెహోవాను.

సంఖ్యాకాండము 3:46 ఇశ్రాయేలీయులకు తొలుతపుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:47 పరిశుద్ధమైన తులముచొప్పున వాటిని తీసికొనవలెను.

సంఖ్యాకాండము 3:48 తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువమంది విమోచనకొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.

సంఖ్యాకాండము 3:49 కాబట్టి మోషే లేవీయులవలన విడిపింపబడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.

సంఖ్యాకాండము 3:50 పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.

సంఖ్యాకాండము 3:51 యెహోవా మోషేకాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.

నిర్గమకాండము 23:15 పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.

ద్వితియోపదేశాకాండము 16:16 ఏటికి మూడు మారులు, అనగా పొంగనిరొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.

1సమూయేలు 9:7 అందుకు సౌలు మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవుదుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మనకేమియు లేదు అని తన పనివానితో చెప్పి మనయొద్ద ఏమి యున్నదని అడుగగా

1సమూయేలు 9:8 వాడు సౌలుతో చిత్తగించుము, నాయొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.

2సమూయేలు 24:24 రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.

నిర్గమకాండము 13:2 ఇశ్రాయేలీయులలో మనుష్యులయొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.

నిర్గమకాండము 13:13 ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించనియెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను.

1సమూయేలు 6:3 వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందురనిరి.