Logo

సంఖ్యాకాండము అధ్యాయము 26 వచనము 34

సంఖ్యాకాండము 1:34 మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

సంఖ్యాకాండము 1:35 మనష్షే గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 2:20 అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:21 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది.

ఆదికాండము 48:16 అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించును గాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను

ద్వితియోపదేశాకాండము 33:17 అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క వేలును ఆలాగున నుందురు.

యెహోషువ 17:14 అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా