Logo

సంఖ్యాకాండము అధ్యాయము 26 వచనము 57

సంఖ్యాకాండము 35:2 ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.

సంఖ్యాకాండము 35:3 వారు నివసించుటకు ఆ పురములు వారివగును. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలెను.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

నిర్గమకాండము 6:16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

నిర్గమకాండము 6:19 మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.

1దినవృత్తాంతములు 6:1 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

1దినవృత్తాంతములు 6:16 లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

1దినవృత్తాంతములు 6:17 గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

1దినవృత్తాంతములు 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు.

1దినవృత్తాంతములు 6:19 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

1దినవృత్తాంతములు 6:20 గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,

1దినవృత్తాంతములు 6:21 జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయి.

1దినవృత్తాంతములు 6:22 కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,

1దినవృత్తాంతములు 6:23 అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,

1దినవృత్తాంతములు 6:24 అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షావూలు.

1దినవృత్తాంతములు 6:25 ఎల్కానా కుమారులు అమాశై అహీమోతు.

1దినవృత్తాంతములు 6:26 ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు,

1దినవృత్తాంతములు 6:27 నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.

1దినవృత్తాంతములు 6:28 సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.

1దినవృత్తాంతములు 6:29 మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు షిమీ, షిమీ కుమారుడు ఉజ్జా

1దినవృత్తాంతములు 6:30 ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.

సంఖ్యాకాండము 3:1 యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.

సంఖ్యాకాండము 4:49 యెహోవా నోటి మాటచొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతివాడును తన తన సేవనుబట్టియు తన తన మోతనుబట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.

ఆదికాండము 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

నిర్గమకాండము 6:18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.

సంఖ్యాకాండము 1:47 అయితే లేవీయులు తమ పితరుల గోత్రముచొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

సంఖ్యాకాండము 3:17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.

1దినవృత్తాంతములు 6:19 మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

1దినవృత్తాంతములు 9:14 మరియు లేవీయులలో మెరారి సంతతివాడైన హషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హష్షూబు కుమారుడైన షెమయా,

1దినవృత్తాంతములు 23:6 గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.