Logo

కీర్తనలు అధ్యాయము 6

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

02 యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము

03 నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?

04 యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము.

05 మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?

06 నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొనిపోవుచున్నది.

07 విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.

08 యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.

09 యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యెహోవా నా ప్రార్థన నంగీకరించును.

10 నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.