Logo

కీర్తనలు అధ్యాయము 140

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యెహోవా, దుష్టులచేతిలోనుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారిచేతిలో పడకుండ నన్ను కాపాడుము.

02 వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.

03 పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)

04 యెహోవా, భక్తిహీనులచేతిలో పడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగుజారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.

05 గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

06 అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయుచున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.

07 ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

08 యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. (సెలా.)

09 నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

10 కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక

11 కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.

12 బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును.

13 నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.