Logo

కీర్తనలు అధ్యాయము 20

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

02 పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.

03 ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక నీ దహనబలులను అంగీకరించును గాక.

04 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.

05 యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

06 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతని కుత్తరమిచ్చును.

07 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

08 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

09 యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకుత్తరమిచ్చును గాక.