Logo

యెహెజ్కేలు అధ్యాయము 14 వచనము 5

యెహెజ్కేలు 2:7 అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము.

యెహెజ్కేలు 3:4 మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయులయొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.

యెహెజ్కేలు 3:17 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించియున్నాను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పినదానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము.

యెహెజ్కేలు 3:18 అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గునిగూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

యెహెజ్కేలు 3:19 అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతనుండి దుష్‌క్రియలనుండియు మరలనియెడల అతడు తన దోషమునుబట్టి మరణమవును గాని నీవు (ఆత్మను) తప్పించుకొందువు.

యెహెజ్కేలు 3:20 మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయనియెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండ అతడు తన దోషమునుబట్టి మరణమవును, అయితే అతని ప్రాణవిషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.

యెహెజ్కేలు 3:21 అయితే పాపము చేయవలదని నీతిగలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానినయెడల అతడు అవశ్యముగా బ్రదుకును, నీ మట్టుకు నీవును (ఆత్మను) తప్పించుకొందువు.

యెహెజ్కేలు 14:7 ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్తయొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.

1రాజులు 21:20 అంతట అహాబు ఏలీయాను చూచి నా పగవాడా, నీచేతిలో నేను చిక్కుబడితినా? అని పలుకగా ఏలీయా ఇట్లనెను యెహోవా దృష్టికి కీడుచేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నాచేతిలో నీవు చిక్కితివి.

1రాజులు 21:21 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను నేను నీమీదికి అపాయము రప్పించెదను; నీ సంతతివారిని నాశము చేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలము చేతును.

1రాజులు 21:22 ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

1రాజులు 21:23 మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.

1రాజులు 21:24 పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటి భూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను

1రాజులు 21:25 తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.

2రాజులు 1:16 అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగిరాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను.

యెషయా 3:11 దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.

యెషయా 66:4 నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.

ద్వితియోపదేశాకాండము 27:15 మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్‌ అనవలెను.

2రాజులు 22:13 మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలనుగూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణ చేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.

యోబు 36:21 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరుకొనియున్నావు.

యిర్మియా 42:1 అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవిచేసిరి

యిర్మియా 42:20 మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.

యెహెజ్కేలు 6:9 మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు

యెహెజ్కేలు 7:19 తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియేగాని బంగారమేగాని వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలు విడువకుండ అభ్యంతరమాయెను గనుక దానివలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు.

యెహెజ్కేలు 8:1 ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.

యెహెజ్కేలు 14:3 నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొనియున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?

యెహెజ్కేలు 14:6 కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి

యెహెజ్కేలు 14:10 ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండునట్లును.

యెహెజ్కేలు 16:59 ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను.

యెహెజ్కేలు 20:3 నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నాయొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 20:16 ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.

యెహెజ్కేలు 20:31 నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

యెహెజ్కేలు 44:12 విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

2తిమోతి 3:7 సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.