Logo

యెహెజ్కేలు అధ్యాయము 20 వచనము 33

యెహెజ్కేలు 11:5 అంతట యెహోవా ఆత్మ నామీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు నీ మాట వారికి తెలియజేయుము, యెహోవా సెలవిచ్చిన మాట యిదే ఇశ్రాయేలీయులారా, మీరీలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి.

యెహెజ్కేలు 38:10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును,

కీర్తనలు 139:2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

సామెతలు 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము.

విలాపవాక్యములు 3:37 ప్రభువు సెలవులేనిది మాటయిచ్చి నెరవేర్చగలవాడెవడు?

1సమూయేలు 8:5 చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.

యిర్మియా 44:17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

యిర్మియా 44:29 మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.

రోమీయులకు 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.

ద్వితియోపదేశాకాండము 4:28 అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.

ద్వితియోపదేశాకాండము 28:36 యెహోవా నిన్నును నీవు నీమీద నియమించుకొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమునకప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

ద్వితియోపదేశాకాండము 28:64 దేశముయొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.

ద్వితియోపదేశాకాండము 29:17 వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడినవారి విగ్రహములను మీరు చూచితిరిగదా.

యెషయా 37:19 వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

దానియేలు 5:4 వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా

ప్రకటన 9:20 ఈ దెబ్బలచేత చావక మిగిలిన జనులు, దయ్యములను, చూడను వినను నడువను శక్తిలేనివై, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండ విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు.

ద్వితియోపదేశాకాండము 12:30 వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 28:65 ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.

యిర్మియా 10:2 యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.

యిర్మియా 23:23 నేను సమీపముననుండు దేవుడను మాత్ర మేనా? దూరముననుండు దేవుడను కానా?

యిర్మియా 44:24 మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.

హోషేయ 2:7 అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడక యుందురు. అప్పుడు అది ఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును.

హోషేయ 3:4 నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

హోషేయ 9:1 ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీద నున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.