Logo

యెహెజ్కేలు అధ్యాయము 29 వచనము 5

యెహెజ్కేలు 38:4 నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలుదేరదీసెదను.

2రాజులు 19:28 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

యోబు 41:1 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?

యోబు 41:2 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?

యెషయా 37:29 నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

ఆమోసు 4:2 ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలములచేతను పట్టుకొని లాగుదురు.

హబక్కూకు 1:14 ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.

హబక్కూకు 1:15 వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.

కీర్తనలు 105:29 ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.

యెహెజ్కేలు 13:8 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 30:10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఐగుప్తీయులు చేయు అల్లరి బబులోనురాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.