Logo

యెహెజ్కేలు అధ్యాయము 31 వచనము 1

యెహెజ్కేలు 30:17 ఓనువారిలోను పిబేసెతు వారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:18 ఐగుప్తుపెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు.

యెహెజ్కేలు 30:23 ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

యెహెజ్కేలు 6:13 తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడికొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

యెహెజ్కేలు 29:12 నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసెదను, పాడైపోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

దానియేలు 11:42 అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.

యెహెజ్కేలు 30:8 ఐగుప్తు దేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

యిర్మియా 44:30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

యెహెజ్కేలు 6:7 మీ జనులు హతులై కూలుదురు.

యెహెజ్కేలు 30:25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తు దేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోను రాజు చేతికియ్యగా నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.

యెహెజ్కేలు 32:9 నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలో నీకు సమూలధ్వంసము కలుగజేసి బహు జనములకు కోపము పుట్టింతును,

యెహెజ్కేలు 32:15 నేను ఐగుప్తు దేశమును పాడుచేసి అందులోని సమస్తమును నాశనము చేసి దాని నివాసులనందరిని నిర్మూలము చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

హబక్కూకు 1:17 వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?