Logo

యెహెజ్కేలు అధ్యాయము 35 వచనము 8

యెహెజ్కేలు 35:3 దానికి మాటయెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను.

యెహెజ్కేలు 35:9 నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును.

యెహెజ్కేలు 33:28 ఆ దేశమును నిర్జనముగాను పాడుగానుచేసి దాని బలాతిశయమును మాన్పించెదను, ఎవరును వాటిలో సంచరింపకుండ ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును.

యెహెజ్కేలు 29:11 దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును.

న్యాయాధిపతులు 5:6 అనాతు కుమారుడైన షవ్గురు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు లాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.

న్యాయాధిపతులు 5:7 ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి

2దినవృత్తాంతములు 15:5 ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.

2దినవృత్తాంతములు 15:6 దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడుచేసెను.

యిర్మియా 49:17 ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.

ఓబధ్యా 1:10 నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికిని లేకుండ నీవు నిర్మూలమగుదువు.