Logo

యెహెజ్కేలు అధ్యాయము 45 వచనము 9

యెహెజ్కేలు 19:3 వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించునదాయెను.

యెహెజ్కేలు 19:7 వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.

యెహెజ్కేలు 22:27 దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.

యెహెజ్కేలు 46:18 జనులు తమ స్వాస్థ్యము ననుభవింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.

సామెతలు 28:16 వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారీ, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

యెషయా 11:3 యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.

యెషయా 11:4 కంటిచూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగా విమర్శచేయును తన వాగ్దండముచేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును

యెషయా 11:5 అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును.

యెషయా 32:1 ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.

యెషయా 32:2 మనుష్యుడు గాలికి మరుగైన చోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్ల కాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.

యెషయా 60:17 నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను.

యెషయా 60:18 ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు.

యిర్మియా 22:17 అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపదాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.

యిర్మియా 23:5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.

మీకా 3:1 నేనీలాగు ప్రకటించితిని యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా.

మీకా 3:2 అయినను మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.

మీకా 3:3 నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలోవేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలోవేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.

మీకా 3:4 వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.

జెఫన్యా 3:13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;

యాకోబు 2:6 అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతులు మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే గదా?

యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి.

యాకోబు 5:2 మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.

యాకోబు 5:3 మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీమీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చు కొంటిరి.

యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

యాకోబు 5:5 మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

యాకోబు 5:6 మీరు నీతిమంతుడైనవానికి శిక్షవిధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.

ప్రకటన 19:11 మరియు పరలోకము తెరువబడి యుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు

ప్రకటన 19:12 ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;

ప్రకటన 19:13 రక్త ములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.

ప్రకటన 19:14 పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

ప్రకటన 19:15 జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన యినుప దండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

ప్రకటన 19:16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది.

యెహోషువ 11:23 యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశ మంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్ప గించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.

యెహోషువ 19:49 సరిహద్దులనుబట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.

1సమూయేలు 8:9 అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

యెషయా 1:26 మొదటనుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును.

యెహెజ్కేలు 44:3 అధిపతియగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికిపోవలెను.

యెహెజ్కేలు 48:21 ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొను స్థానము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.

జెకర్యా 12:5 అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.