1దినవృత్తాంతములు 24: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల యెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;
మరియు బరువులు మోయువారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులునైనవారు ఆ యా పనులమీద నియమింపబడిరి.
ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.
ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా
అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొనివచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.
వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణములన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొనివచ్చిరి.
యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా