Logo

కీర్తనలు అధ్యాయము 9 వచనము 10

కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను

నిర్గమకాండము 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను.

నిర్గమకాండము 34:6 అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా.

నిర్గమకాండము 34:7 ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికిని కుమారుల కుమారులమీదికిని రప్పించునని ప్రకటించెను.

1దినవృత్తాంతములు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము,ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును.

సామెతలు 18:10 యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.

యోహాను 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.

2కొరిందీయులకు 4:6 గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించుకొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.

2తిమోతి 1:12 ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.

1యోహాను 2:3 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.

1యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

కీర్తనలు 5:11 నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

కీర్తనలు 57:1 నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కలనీడను శరణుజొచ్చియున్నాను.

కీర్తనలు 146:5 ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు

కీర్తనలు 146:6 ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.

యెషయా 26:3 ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.

యెషయా 26:4 యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.

కీర్తనలు 105:3 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక.

కీర్తనలు 105:4 యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి

యెషయా 45:19 అంధకార దేశములోని మరుగైనచోటున నేను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు3 నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.

యెషయా 46:3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నాచేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

యెషయా 46:4 ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే తల వెండ్రుకలు నెరయువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే నేనే చేసియున్నాను చంకపెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.

యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

యెషయా 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

యిర్మియా 29:13 మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,

2కొరిందీయులకు 1:9 మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మికయుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

2కొరిందీయులకు 1:10 ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

ద్వితియోపదేశాకాండము 3:21 ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లంటిని మీ దేవుడైన యెహోవా ఈ యిద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా. నీవు వెళ్లుచున్న రాజ్యములనన్నిటికిని యెహోవా ఆలాగుననే చేయును.

1దినవృత్తాంతములు 5:20 యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

2దినవృత్తాంతములు 16:8 బహు విస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతి కప్పగించెను.

యోబు 24:1 సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు?

కీర్తనలు 11:1 యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?

కీర్తనలు 16:1 దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.

కీర్తనలు 20:1 ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

కీర్తనలు 34:22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.

కీర్తనలు 36:10 నిన్ను ఎరిగినవారియెడల నీ కృపను యథార్థహృదయులయెడల నీ నీతిని ఎడతెగక నిలుపుము.

యిర్మియా 22:16 అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.

దానియేలు 11:32 అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు.

హోషేయ 5:4 తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు.

మార్కు 6:54 వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి

యోహాను 7:28 కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.

2కొరిందీయులకు 4:9 తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.

గలతీయులకు 4:9 యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరివిశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?

2దెస్సలోనీకయులకు 1:8 మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే.

1పేతురు 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.