Logo

కీర్తనలు అధ్యాయము 20 వచనము 7

కీర్తనలు 33:16 ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.

కీర్తనలు 33:17 రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింపజాలదు.

1సమూయేలు 13:5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.

2సమూయేలు 8:4 అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందలమంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలినవాటికి చీలమండ నరములను తెగవేయించెను.

2సమూయేలు 10:18 సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము కలిపి ఇశ్రాయేలీయుల యెదుట నిలువజాలక పారిపోగా, దావీదు సిరియనులలో ఏడు వందలమంది రథికులను నలువదివేల మంది గుఱ్ఱపు రౌతులను హతము చేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.

సామెతలు 21:31 యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము.

యెషయా 30:16 అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కి పోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.

యెషయా 31:1 ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.

యిర్మియా 17:5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

కీర్తనలు 45:17 తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.

2దినవృత్తాంతములు 13:10 అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించినవారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.

2దినవృత్తాంతములు 13:11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.

2దినవృత్తాంతములు 13:12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు.

2దినవృత్తాంతములు 13:16 ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున

2దినవృత్తాంతములు 14:11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

2దినవృత్తాంతములు 20:12 మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.

2దినవృత్తాంతములు 20:13 యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.

2దినవృత్తాంతములు 20:14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటించెను

2దినవృత్తాంతములు 20:15 యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.

2దినవృత్తాంతములు 20:16 రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనదగ్గర వారిని కనుగొందురు.

2దినవృత్తాంతములు 20:17 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.

2దినవృత్తాంతములు 20:18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.

2దినవృత్తాంతములు 20:19 కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి.

2దినవృత్తాంతములు 20:20 అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి యూదా వారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.

2దినవృత్తాంతములు 32:8 మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

నిర్గమకాండము 14:7 మరియు అతడు శ్రేష్ఠమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములనన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.

ద్వితియోపదేశాకాండము 17:16 అతడు గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకొనవలదు; తాను గుఱ్ఱములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్లనియ్యకూడదు; ఏలయనగా యెహోవా ఇకమీదట మీరు ఈ త్రోవను వెళ్లకూడదని మీతో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 20:1 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

యెహోషువ 11:6 యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయులచేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరిని అప్ప గించెదను. నీవు వారి గుఱ్ఱముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషు వతో సెలవిచ్చెను.

న్యాయాధిపతులు 5:22 గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.

2సమూయేలు 15:1 ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.

1రాజులు 4:26 సొలొమోను రథములకు నలువదివేల గుఱ్ఱపు శాలలును రౌతులకు పండ్రెండు వేల గుఱ్ఱములును ఉండెను.

2రాజులు 7:7 లేచి తమ గుడారములలోనైనను గుఱ్ఱములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని, సందెచీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి.

2రాజులు 18:24 అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే.

2రాజులు 19:23 ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

1దినవృత్తాంతములు 5:20 యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను

1దినవృత్తాంతములు 18:4 అతనియొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.

1దినవృత్తాంతములు 19:7 ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమ తమ పట్టణములలోనుండి కూడుకొని యుద్దము చేయుటకు వచ్చిరి.

2దినవృత్తాంతములు 13:12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు.

2దినవృత్తాంతములు 25:8 ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమేగదా అని ప్రకటింపగా

నెహెమ్యా 4:14 అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.

ఎస్తేరు 9:5 యూదులు తమ శత్రువులనందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సుతీర తమ విరోధులకు చేసిరి.

యోబు 39:11 దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?

కీర్తనలు 21:7 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మికయుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును.

కీర్తనలు 44:6 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు

కీర్తనలు 60:10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?

కీర్తనలు 147:10 గుఱ్ఱముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు.

యెషయా 2:7 వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు వారి దేశము గుఱ్ఱములతో నిండియున్నది వారి రథములకు మితిలేదు.

యెషయా 36:8 కావున చిత్తగించి అష్షూరు రాజైన నా యేలినవానితో పందెము వేయుము; రెండువేల గుఱ్ఱములమీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి యున్నయెడల నేను వాటిని నీకిచ్చెదను.

యెషయా 37:24 నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి నీవీలాగు పలికితివి నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

యెషయా 50:11 ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీచుట్టు పెట్టుకొనువారలారా, మీ అగ్నిజ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి నాచేతివలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదనగలవారై పండుకొనెదరు.

యిర్మియా 50:37 ఖడ్గము వారి గుఱ్ఱములమీద పడును వారి రథములమీద పడును ఖడ్గము వారిమీదికి దిగుటచేత దానిలోనున్న పరదేశులు స్త్రీలవంటివారగుదురు అది దాని నిధులమీద పడగా అవి దోచుకొనబడును.

హోషేయ 14:3 అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మాచేతిపనితో చెప్పము; తండ్రిలేనివారియెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.

యోనా 2:7 కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని; నీ పరిశుద్ధాలయములోనికి నీయొద్దకు నా మనవి వచ్చెను.

మీకా 5:10 ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనముచేతును, నీ రథములను మాపివేతును,

జెకర్యా 10:5 వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలె ఉందురు. యెహోవా వారికి తోడైయుండును గనుక వారు యుద్ధము చేయగా గుఱ్ఱములను ఎక్కువారు సిగ్గునొందుదురు.

జెకర్యా 12:5 అప్పుడు యెరూషలేములోని అధికారులు యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.

మలాకీ 3:16 అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.