Logo

కీర్తనలు అధ్యాయము 33 వచనము 5

కీర్తనలు 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.

కీర్తనలు 45:7 నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించియున్నాడు.

కీర్తనలు 99:4 యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.

హెబ్రీయులకు 1:9 నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.

ప్రకటన 15:3 వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;

ప్రకటన 15:4 ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

కీర్తనలు 104:24 యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది.

కీర్తనలు 119:64 (తే­త్‌) యహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.

కీర్తనలు 145:15 సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు.

కీర్తనలు 145:16 నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.

మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.

అపోస్తలులకార్యములు 14:17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుట చేత తన్నుగూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి

యెషయా 61:8 ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.

దానియేలు 4:37 ఈలాగు నెబుకద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై యున్నవనియు, గర్వముతో నటించువారిని ఆయన అణపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు నున్నాను.

2దెస్సలోనీకయులకు 1:5 దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.