Logo

కీర్తనలు అధ్యాయము 38 వచనము 6

కీర్తనలు 35:14 అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలె క్రుంగుచుంటిని.

కీర్తనలు 42:5 నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.

కీర్తనలు 57:6 నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంటత్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.)

కీర్తనలు 145:14 యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు

కీర్తనలు 6:6 నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొనిపోవుచున్నది.

కీర్తనలు 31:10 నా బ్రదుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా యేండ్లు గతించుచున్నవి నా దోషమునుబట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా యెముకలు క్షీణించుచున్నవి.

కీర్తనలు 42:9 కావున నీవేల నన్ను మరచియున్నావు? శత్రుబాధచేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను.

కీర్తనలు 43:2 నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసితి వేమి? నేను శత్రుబాధచేత దుఃఖాక్రాంతుడనై సంచరింప నేల?

కీర్తనలు 88:9 బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నాచేతులు చాపుచున్నాను.

యోబు 30:28 సూర్యుని ప్రకాశములేక వ్యాకులపడుచు నేను సంచరించుచున్నాను సమాజములో నిలువబడి మొఱ్ఱపెట్టుచున్నాను.

యెషయా 38:14 మంగలకత్తి పిట్టవలెను ఓదెకొరుకువలెను నేను కిచకిచలాడితిని గువ్వవలె మూల్గితిని ఉన్నత స్థలముతట్టు చూచి చూచి నాకన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగెను; యెహోవా, నాకొరకు పూటబడియుండుము.

కీర్తనలు 38:17 నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.

కీర్తనలు 55:2 నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

కీర్తనలు 116:3 మరణబంధములు నన్ను చుట్టుకొనియుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

సామెతలు 12:25 ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.

లూకా 13:11 పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంతమాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.