Logo

కీర్తనలు అధ్యాయము 40 వచనము 9

కీర్తనలు 22:22 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను.

కీర్తనలు 22:25 మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

కీర్తనలు 35:18 అప్పుడు మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

కీర్తనలు 71:15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.

కీర్తనలు 71:16 ప్రభువైన యెహోవాయొక్క బలవత్కార్యములనుబట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను నీ నీతినిమాత్రమే నేను వర్ణించెదను.

కీర్తనలు 71:17 దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.

కీర్తనలు 71:18 దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమునుగూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమునుగూర్చియు నేను తెలియజెప్పునట్లు తలనెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.

మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

లూకా 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

లూకా 4:17 ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

లూకా 4:18 ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

లూకా 4:19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

లూకా 4:20 ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

లూకా 4:21 సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

లూకా 4:22 అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా

హెబ్రీయులకు 2:12 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానముచేతును అనెను.

కీర్తనలు 119:13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.

కీర్తనలు 119:171 నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును

కీర్తనలు 119:172 నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.

కీర్తనలు 139:2 నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

యోహాను 21:17 మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.

ద్వితియోపదేశాకాండము 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీచేతికి కట్టుకొనవలెను.

1రాజులు 8:65 మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును హమాతునకు పోవుమార్గము మొదలుకొని ఐగుప్తునది వరకు నున్న సకల ప్రాంతములనుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు, అనగా పదునాలుగు దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి.

యోబు 6:10 అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదనపడుచుండినను దానిబట్టి హర్షించుదును

యోబు 7:11 కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.

కీర్తనలు 89:1 యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను.

కీర్తనలు 107:32 జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక

కీర్తనలు 111:1 యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణహృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

కీర్తనలు 145:5 మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను

ప్రసంగి 1:1 దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు.

ప్రసంగి 10:12 జ్ఞానుని నోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.

యెషయా 48:6 నీవు ఆ సంగతి వినియున్నావు ఇదంతయు ఆలోచించుము అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా? తెలియని మరుగైన క్రొత్తసంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను

యెషయా 58:1 తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము

మత్తయి 13:54 అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతనికెక్కడనుండి వచ్చినవి?

మార్కు 2:2 ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

మార్కు 4:22 రహస్యమేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగు చేయబడలేదు

యోహాను 6:59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.

యోహాను 7:26 ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?

యోహాను 18:20 యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.

అపోస్తలులకార్యములు 20:20 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు,

రోమీయులకు 1:16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.

ఫిలిప్పీయులకు 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమునుచేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయ కారణము కలదు

కొలొస్సయులకు 4:6 ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.

2తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.