Logo

కీర్తనలు అధ్యాయము 58 వచనము 8

కీర్తనలు 37:35 భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టువలె వాడు వర్ధిల్లియుండెను.

కీర్తనలు 37:36 అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.

యాకోబు 1:10 ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.

యోబు 3:16 అకాల సంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయియుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయియుందును.

ప్రసంగి 6:3 ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను

సంఖ్యాకాండము 12:12 తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా

యోబు 3:11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని?

యోబు 10:19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును.

యోబు 24:19 అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసినవారిని పట్టుకొనును.

యోబు 29:17 దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

కీర్తనలు 112:10 భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

ప్రసంగి 6:5 అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మది గలది.

హోషేయ 9:11 ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.