Logo

కీర్తనలు అధ్యాయము 59 వచనము 17

కీర్తనలు 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను.

కీర్తనలు 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

కీర్తనలు 59:9 నా బలమా, నీకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే.

కీర్తనలు 59:10 నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.

నిర్గమకాండము 15:2 యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.

కీర్తనలు 56:12 దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపువెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.

కీర్తనలు 62:2 ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఎన్నాళ్లు మీరు ఒకని పైబడుదురు?

కీర్తనలు 94:22 యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.

కీర్తనలు 140:7 ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.