Logo

కీర్తనలు అధ్యాయము 61 వచనము 8

కీర్తనలు 30:12 నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.

కీర్తనలు 79:13 అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.

కీర్తనలు 145:1 రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను

కీర్తనలు 145:2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.

కీర్తనలు 146:2 నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను

కీర్తనలు 65:1 దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతిచెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.

కీర్తనలు 66:13 దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.

కీర్తనలు 66:14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను

కీర్తనలు 66:15 పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొఱ్ఱలను తీసికొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను పోతుమేకలను అర్పించెదను.(సెలా).

కీర్తనలు 66:16 దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి ఆయన నాకొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను.

ఆదికాండము 28:20 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

లేవీయకాండము 22:18 నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో