Logo

కీర్తనలు అధ్యాయము 68 వచనము 32

కీర్తనలు 67:2 దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)

కీర్తనలు 67:3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)

కీర్తనలు 67:4 జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక

కీర్తనలు 67:5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.

కీర్తనలు 100:1 సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.

కీర్తనలు 117:1 యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును.

కీర్తనలు 117:2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వ జనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.

ద్వితియోపదేశాకాండము 32:43 జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.

రోమీయులకు 15:10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు

రోమీయులకు 15:11 మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది.

ప్రకటన 15:4 ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

2దినవృత్తాంతములు 6:4 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.

కీర్తనలు 96:1 యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి

కీర్తనలు 96:7 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.

కీర్తనలు 102:15 అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు

కీర్తనలు 147:7 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి. సితారాతో మన దేవుని కీర్తించుడి.

కీర్తనలు 148:11 భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి.

యెషయా 12:5 యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.

హెబ్రీయులకు 7:25 ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.