Logo

కీర్తనలు అధ్యాయము 109 వచనము 5

కీర్తనలు 35:7 నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.

కీర్తనలు 35:12 మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.

కీర్తనలు 38:20 మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి

2సమూయేలు 13:39 రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.

యోహాను 10:32 యేసు తండ్రియొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.

2కొరిందీయులకు 12:15 కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?

కీర్తనలు 55:16 అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.

కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును

కీర్తనలు 69:12 గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాటలాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.

కీర్తనలు 69:13 యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.

2సమూయేలు 15:31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.

2సమూయేలు 15:32 దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొనివచ్చి రాజును దర్శనము చేసెను.

దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

లూకా 6:11 అప్పుడు వారు వెఱ్ఱి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.

లూకా 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.

లూకా 23:34 యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.

ఆదికాండము 37:18 అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరమునుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

సంఖ్యాకాండము 20:6 అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.

న్యాయాధిపతులు 9:18 అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలె కును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల

న్యాయాధిపతులు 12:1 ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు పోయినీవు అమ్మోనీయులతో యుద్ధము చేయ బోయి నప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా

1సమూయేలు 8:6 మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.

1సమూయేలు 15:11 సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.

1సమూయేలు 19:4 యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చి దయగా మాటలాడి నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువు గాక.

2సమూయేలు 10:4 అంతట హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని, సగము గడ్డము గొరిగించి, వారు తొడుగుకొనిన బట్టలను నడిమికి పిఱ్ఱలమట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టెను.

1దినవృత్తాంతములు 19:4 హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.

2దినవృత్తాంతములు 24:22 ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

యోబు 16:20 నా స్నేహితులు నన్ను ఎగతాళిచేయుచున్నారు. నరుని విషయమై యొకడు దేవునితో వ్యాజ్యెమాడవలెననియు

యోబు 19:19 నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.

సామెతలు 17:13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.

యిర్మియా 18:19 యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.

యిర్మియా 18:20 వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.

యిర్మియా 43:3 మమ్మును చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింపవలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)

మీకా 7:7 అయినను యెహోవా కొరకు నేను ఎదురుచూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.

మార్కు 1:35 ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను.

మార్కు 3:6 పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయననేలాగు సంహరింతుమా యని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.

మార్కు 14:32 వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి

లూకా 9:28 ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను.

లూకా 20:43 ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు.

లూకా 24:44 అంతట ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను

యోహాను 11:53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలోచించుచుండిరి.

యోహాను 11:57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్నయెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

రోమీయులకు 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

కొలొస్సయులకు 4:2 ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.