Logo

కీర్తనలు అధ్యాయము 129 వచనము 4

కీర్తనలు 141:7 ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా యెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.

యెషయా 51:23 నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టెదను మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగాచేసి నేలకు దానిని వంచితివి గదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.

యోబు 39:10 పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్టగలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?

కీర్తనలు 94:5 యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని

యెషయా 9:12 తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరుతెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

మార్కు 15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.

యోహాను 19:1 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.