Logo

కీర్తనలు అధ్యాయము 139 వచనము 14

యోబు 10:9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?

యోబు 10:10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.

యోబు 10:11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి.

యోబు 10:12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి.

కీర్తనలు 22:9 గర్భమునుండి నన్ను తీసినవాడవు నీవే గదా నేను నా తల్లియొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి.

కీర్తనలు 22:10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే.

కీర్తనలు 71:6 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై యుంటివి తల్లిగర్భమునుండి నన్ను ఉద్భవింపజేసినవాడవు నీవే నిన్నుగూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును.

యోబు 31:15 గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

యెషయా 44:2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము.

యెషయా 46:3 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించినవారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నాచేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకపెట్టుకొనినవారలారా, నా మాట ఆలకించుడి.

యిర్మియా 1:5 గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.

యోబు 3:11 గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువకపోతిని?

కీర్తనలు 100:3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.

కీర్తనలు 139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు

యెషయా 44:24 గర్భమునుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను

రోమీయులకు 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

1కొరిందీయులకు 12:17 శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?