Logo

కీర్తనలు అధ్యాయము 148 వచనము 5

కీర్తనలు 113:6 ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు.

1రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?

2కొరిందీయులకు 12:2 క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును.

కీర్తనలు 104:3 జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కలమీద గమనము చేయుచున్నాడు

ఆదికాండము 1:7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.

ఆదికాండము 7:11 నోవహు వయసు యొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపుతూములు విప్పబడెను.

ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

ఆదికాండము 1:6 మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను.

ద్వితియోపదేశాకాండము 10:14 చూడుము; ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే.

యోబు 37:18 పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా?

కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.

కీర్తనలు 115:16 ఆకాశములు యెహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు.

యెషయా 55:12 మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొనిపోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.

యిర్మియా 10:12 ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.