Logo

లూకా అధ్యాయము 1 వచనము 6

మత్తయి 2:1 రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

1దినవృత్తాంతములు 24:10 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,

1దినవృత్తాంతములు 24:19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.

నెహెమ్యా 12:4 ఇద్దో గిన్నెతోను అబీయా.

నెహెమ్యా 12:17 అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.

నిర్గమకాండము 6:23 అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.

2దినవృత్తాంతములు 8:14 అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.

2దినవృత్తాంతములు 31:2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.

లూకా 1:8 జెకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా

1తిమోతి 3:11 అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

తీతుకు 1:6 ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.