Logo

లూకా అధ్యాయము 1 వచనము 64

సామెతలు 3:3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్యకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.

యెషయా 30:8 రాబోవు దినములలో చిరకాలమువరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్లి వారియెదుట పలకమీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము

యిర్మియా 17:1 వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్థంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా

హబక్కూకు 2:2 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.

లూకా 1:13 అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

లూకా 1:60 తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

ఆదికాండము 16:11 మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;

హోషేయ 1:4 యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను ఇతనికి యెజ్రెయేలని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమునుబట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసివేతును.

లూకా 1:20 మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.