Logo

లూకా అధ్యాయము 1 వచనము 35

న్యాయాధిపతులు 13:8 అందుకు మానోహనా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మాయొద్దకువచ్చి, పుట్ట బోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయు మని యెహోవాను వేడు కొనగా

న్యాయాధిపతులు 13:9 దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.

న్యాయాధిపతులు 13:10 ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమెయొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తిఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.

న్యాయాధిపతులు 13:11 అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.

న్యాయాధిపతులు 13:12 అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా

అపోస్తలులకార్యములు 9:6 లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.

ఆదికాండము 15:8 అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా

ఆదికాండము 18:12 శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడైయున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.

సంఖ్యాకాండము 11:22 వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.

న్యాయాధిపతులు 6:15 అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

1సమూయేలు 16:2 సమూయేలు నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

యిర్మియా 31:22 నీవు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును.

లూకా 1:18 జెకర్యా యిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా

యోహాను 3:9 అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా

అపోస్తలులకార్యములు 27:31 అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.