Logo

లూకా అధ్యాయము 1 వచనము 15

లూకా 1:58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

ఆదికాండము 21:6 అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

సామెతలు 15:20 జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.

సామెతలు 23:15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల నా హృదయముకూడ సంతోషించును.

సామెతలు 23:24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.

ప్రసంగి 3:4 ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;

యిర్మియా 20:15 నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగును గాక;

లూకా 7:28 స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను.