Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 1 వచనము 22

సంఖ్యాకాండము 13:1 యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

సంఖ్యాకాండము 13:2 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

సంఖ్యాకాండము 13:3 మోషే యెహోవా మాటవిని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.

సంఖ్యాకాండము 13:4 వారి పేళ్లు ఏవనగా రూబేను గోత్రమునకు

సంఖ్యాకాండము 13:5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;

సంఖ్యాకాండము 13:6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;

సంఖ్యాకాండము 13:7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;

సంఖ్యాకాండము 13:8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;

సంఖ్యాకాండము 13:9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;

సంఖ్యాకాండము 13:10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

సంఖ్యాకాండము 13:11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

సంఖ్యాకాండము 13:12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;

సంఖ్యాకాండము 13:13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

సంఖ్యాకాండము 13:14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

సంఖ్యాకాండము 13:15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.

సంఖ్యాకాండము 13:16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.

సంఖ్యాకాండము 13:17 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండయెక్కి ఆ దేశము ఎట్టిదో

సంఖ్యాకాండము 13:18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

సంఖ్యాకాండము 13:19 వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,

సంఖ్యాకాండము 13:20 దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము

సంఖ్యాకాండము 13:2 నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.

సంఖ్యాకాండము 20:1 మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

సంఖ్యాకాండము 32:8 ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా