Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 5 వచనము 8

ద్వితియోపదేశాకాండము 4:15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్యనుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు.

ద్వితియోపదేశాకాండము 4:16 కావున మీరు చెడిపోయి భూమిమీదనున్న యే జంతువు ప్రతిమనైనను

ద్వితియోపదేశాకాండము 4:17 ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను

ద్వితియోపదేశాకాండము 4:18 నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపము గలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి

ద్వితియోపదేశాకాండము 4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడుడి.

నిర్గమకాండము 20:4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

లేవీయకాండము 26:1 మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

ద్వితియోపదేశాకాండము 27:15 మలిచిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా ఆమేన్‌ అనవలెను.

కీర్తనలు 97:7 వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడుదురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.

యెషయా 40:25 నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

అపోస్తలులకార్యములు 7:43 మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసికొనిపోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.

రోమీయులకు 1:23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.