Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 11 వచనము 30

ఆదికాండము 12:6 అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.

యెహోషువ 5:9 అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు.

న్యాయాధిపతులు 7:1 అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.

ఆదికాండము 50:11 ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్‌ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.

ద్వితియోపదేశాకాండము 27:4 మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీకాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.

యెహోషువ 8:30 మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము

నెహెమ్యా 12:29 మరియు గిల్గాలు యొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొనియుండిరి.

యెహెజ్కేలు 37:2 యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.