Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 15 వచనము 7

ద్వితియోపదేశాకాండము 15:9 విడుదల సంవత్సరమైన యేడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును.

సామెతలు 21:13 దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱ పెట్టునప్పుడు అంగీకరింపబడడు.

మత్తయి 18:30 వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.

యాకోబు 2:15 సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనములేక యున్నప్పుడు.

యాకోబు 2:16 మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము?

1యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.

1యోహాను 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?

లేవీయకాండము 25:35 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.

1సమూయేలు 30:11 పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చుకొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.

నెహెమ్యా 5:1 తమ సహోదరులైన యూదుల మీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదు చేసిరి.

నెహెమ్యా 5:3 మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువపెట్టితివిు గనుక మీయొద్ద ధాన్యము తీసికొందుమనిరి.

నెహెమ్యా 10:31 దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజనపదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.

యోబు 22:7 దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.

యోబు 31:16 బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను

కీర్తనలు 41:1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.

కీర్తనలు 112:5 దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును

సామెతలు 19:17 బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.

సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెననొందును.

సామెతలు 28:27 బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.

ప్రసంగి 11:1 నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినములైన తరువాత అది నీకు కనబడును.

యెషయా 58:10 ఆశించినదానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

యెహెజ్కేలు 18:7 ఎవనినైనను భాదపెట్టకయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయు నుండువాడై, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి

జెకర్యా 7:9 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చియున్నాడు సత్యముననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి.

మత్తయి 5:42 నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వానినుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.

మత్తయి 25:35 నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;

లూకా 6:30 నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొనిపోవు వానియొద్ద దాని మరల అడుగవద్దు.

2కొరిందీయులకు 9:7 సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

1తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలు చేయువారును,

యాకోబు 1:9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నతదశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.