Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 20 వచనము 7

ద్వితియోపదేశాకాండము 22:23 కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించినయెడల

ద్వితియోపదేశాకాండము 22:24 ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలోనుండి పరిహరించుదురు.

ద్వితియోపదేశాకాండము 22:25 ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.

ద్వితియోపదేశాకాండము 24:5 ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింటఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.

మత్తయి 1:18 యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

ద్వితియోపదేశాకాండము 28:30 స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువు గాని దాని పండ్లు తినవు.

లూకా 14:18 అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడు కొనుచున్నాననెను

లూకా 14:19 మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను.

లూకా 14:20 మరియొకడు నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.

2తిమోతి 2:4 సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.

నిర్గమకాండము 21:8 దానిని ప్రధానము చేసికొనిన యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు.