Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 22 వచనము 14

ద్వితియోపదేశాకాండము 22:19 ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు.

నిర్గమకాండము 20:16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

నిర్గమకాండము 23:1 లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;

సామెతలు 18:8 కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.

సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు

1తిమోతి 5:14 కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను.

ఆదికాండము 43:18 ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగిపెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.